తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే మహమ్మారిని తరిమికొట్టగలం' - సంగారెడ్డిలో భాజపా నాయకలు సమావేశం

కరోనా మహమ్మారి కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే వైరస్​ను తరిమికొట్టవచ్చని మాజీ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భాజపా ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేయడం కోసం సంగారెడ్డిలో సమావేశం ఏర్పాటు చేశారు.

bjp leaders meeting in sangareddy
'ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే మహమ్మారిని తరిమికొట్టగలం'

By

Published : Jul 11, 2020, 8:51 PM IST

రాష్ట్ర ప్రభుత్వం.. కరోనాను కట్టడి చేద్దాం అనే మాటలే కానీ చేతల్లో చూపడం లేదని భాజపా నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. సంగారెడ్డిలోని ఓ హాల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి విజయాలపై సమావేశం నిర్వహించారు. కష్ట కాలంలో రాజకీయాలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే కరోనా మహమ్మరిని ఎదుర్కోగలమని అన్నారు.

పక్క రాష్ట్రంలో కరోనాని ఆరోగ్యశ్రీ లో చేర్చారు కానీ మన రాష్ట్రంలో చేర్చకుండా సాకులు చెప్పడం సబబు కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరోనాని తరిమి కొట్టే ప్రయత్నాలు చేయాలని, వైరస్ సోకిన వారికి మంచి వైద్యం అందించాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:షాపింగ్ సెంటర్​లో​ భారీ అగ్ని ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details