సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గణేష్ దేవాలయ అర్చకులకు, సిబ్బందికి రాష్ట్ర భాజపా నాయకులు శ్రీకాంత్ గౌడ్ నిత్యావసరాలు అందించారు. ఈ సందర్భంగా వారికి 25కేజీల బియ్యంతోపాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా అర్చకులు పడుతున్న బాధలను చూసి వారికి సరుకులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
అర్చకులకు నిత్యావసర సరుకుల పంపిణీ - నిత్యావసర సరుకుల పంపిణీ
లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులకు భాజపా నాయకులు చేయూతనందించారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని పేద బ్రాహ్మణులకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
అర్చకులకు నిత్యావసర సరుకుల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో చాలా మంది పేదలకు సహాయం అందలేదని వారిని ప్రభుత్వం గుర్తించి సాయం చేయాలని కోరారు.