బీసీలకు తెరాస ప్రభుత్వం అన్యాయం చేస్తోందని భాజపా ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ఆరోపించారు. అరచేతిలో వైకుంఠం చూపించి మోసగిస్తోందని విమర్శంచారు. ప్రాంతీయ నేతలను కరివేపాకులా తెసేస్తోందని మండిపడ్డారు.
భాజపా ఓబీసీ రాష్ట్ర శాఖ పిలుపుతో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రాంతీయ నేతలకు ఎవరికీ గౌరవం ఇవ్వకుండా కేసీఆర్ గడీలపాలన చేస్తున్నారని విమర్శంచారు.
3 వేల పింఛన్ ఇవ్వాలి..
గొల్ల కుర్మల వద్ద ప్రభుత్వం డబ్బులు తీసుకుందని గడీల ఆరోపించారు. వాళ్లకు నగదును నేరుగా ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా వారికి పథకం అమలుకాక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.
50 ఏళ్లు దాటిన గొల్ల కురుమలకు 3 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 26న మెదక్ కలెక్టరేట్ ముట్టడికి అందరూ సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి:పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి : తలసాని