తెరాస పాలనలో సొసైటీ స్థలాలను కబ్జా చేసి విక్రయించారని వాటిని కాపాడేందుకు కృషి చేస్తానని భాజపా అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా భారతినగర్ డివిజన్లో ఆమె ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్కుల్లో ఎలాంటి సౌకర్యాలు లేవని వాటిని అభివృద్ధి చేస్తామన్నారు.
తెరాస పాలనలో ప్రజలు విసిగిపోయారు : గోదావరి అంజిరెడ్డి - సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారం
ఆరేళ్ల తెరాస పాలనలో ప్రజలు విసిగిపోయారని భాజపా అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపాను గెలిపించాలంటూ సంగారెడ్డి జిల్లా భారతినగర్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తెరాస పాలనలో ప్రజలు విసిగిపోయారు : గోదావరి అంజిరెడ్డి
డివిజన్ పరిధిలో ఇళ్లు లేని పేదలకు పట్టాలు వచ్చే విధంగా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీలో భాజపాను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై పోరాడతానని ఆమె తెలిపారు. కమలం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అంజిరెడ్డి అభ్యర్థించారు.