తెలంగాణ

telangana

ETV Bharat / state

నారాయణఖేడ్​లో త్వరలో బైక్​ అంబులెన్స్​ సేవలు

నారాయణఖేడ్​లో 108 బైక్ అంబులెన్స్ వాహనాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు జీవీకే ఈఎంఆర్​ఐ సంస్థ రాష్ట్ర రీజియన్ మేనేజర్ ఖలీల్ అహ్మద్ తెలిపారు. పెరుగుతున్న అత్యవసర సేవల నిమిత్తం 108 ద్విచక్ర వాహనాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.

Bike ambulance services soon in Narayankhed
నారాయణఖేడ్​లో త్వరలో బైక్​ అంబులెన్స్​ సేవలు

By

Published : Nov 6, 2020, 4:58 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో 108 బైక్ అంబులెన్స్ వాహనాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు జీవీకే ఈఎంఆర్​ఐ సంస్థ రాష్ట్ర రీజియన్ మేనేజర్ ఖలీల్ అహ్మద్ తెలిపారు. ఆయన శుక్రవారం నారాయణఖేడ్​లోని 108, 1962, 102 అంబులెన్స్ వాహనాలను ఆకస్మిక తనిఖీ చేశారు. వాహనాల పనితీరు, పరికరాలను పరిశీలించారు.

అనంతరం పెరుగుతున్న అత్యవసర సేవల నిమిత్తం ఒక 108 ద్విచక్ర వాహనాన్ని నారాయణ ఖేడ్ పట్టణంలో అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఖేడ్ అంబులెన్స్​లో పలు రికార్డులు తనిఖీ నిర్వహించి ఎమర్జెన్సీ కేసులు, ప్రజలకు అందుతున్న సేవల గురించి స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మరికొన్ని సూచనలు చేశారు. సమాచారం అందగానే సాధ్యం అయినంత త్వరగా చేరుకొని ప్రమాద బాధితులను కాపాడాలని అన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రోగ్రాం మేనేజర్ జాన్ షాహిద్, జిల్లా అధికారి కుమార స్వామి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details