భూ సమస్యల సత్వర పరిష్కారానికై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు భూవాణి అనే సరికొత్త కార్యక్రమానికి గత నెల 30న శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 25 మండలాల్లో ఓకేరోజు భూ సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రోజు ఒక మండలాన్ని ఎంపిక చేసుకొని.. భూసమస్యలను పరిష్కరిస్తున్నారు.
భూవాణి కార్యక్రమానికి విశేష స్పందన - bhoovani-programme in sangareddy district
సంగారెడ్డి జిల్లాలో భూ సమస్యల సత్వర పరిష్కారినికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు భూవాణి అనే సరికొత్త కార్యక్రమంను తీసుకొచ్చారు. మండలాల్లో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.

భూవాణి కార్యక్రమానికి విశేష స్పందన
సోమవారం కంది మండల కేంద్రంలో భూవాణి కార్యక్రమం నిర్వహించగా.. సంగారెడ్డి ఆర్డీవో శ్రీను పాల్గొన్నారు. మండలంలో మొత్తం 565 దరఖాస్తులు రాగా.. అధికారులు కేవలం 85 సమస్యలకు మాత్రమే పరిష్కారం చూపారు. మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని మండల తహసీల్దారు సరస్వతి రైతులకు హామీ ఇచ్చారు. భూవాణి కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తహసీల్దార్ కార్యాలయం సందడిగా మారింది.
భూవాణి కార్యక్రమానికి విశేష స్పందన