సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ పరిశ్రమ ఎదుట బీఎంఎస్ కార్మికులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియను నిలుపుదల చేయాలని బీహెచ్ఈఎల్ బీఎంఎస్ అధ్యక్షులు రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. స్కూల్, క్యాంటీన్, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీలను కొనసాగించాలని కోరారు.
'ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోండి' - బెల్ పరిశ్రమ బీఎంఎస్ ఉద్యోగుల నిరసన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలును వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ పరిశ్రమలోని బీఎంఎస్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
'ప్రభుత్వ రంగ సంస్థల ప్రవైటీకరణను ఉపసంహరించుకోండి'
కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు. బీహెచ్ఈఎల్ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయాలని, చికిత్సకై కార్పొరేట్ దవాఖానాలకు రిఫర్ చేయాలన్నారు. పరిశ్రమలోని పలు సమస్యలపై సీఎండీకి మెయిల్ ద్వారా స్థానిక ఈడీ ఆఫీసులో మెమోరాండం అందజేశారు.
ఇవీ చూడండి: స్నేహానికి గుర్తుగా గిఫ్ట్ పంపించానని లక్షలు లాగేశాడు