సంగారెడ్డి జిల్లా మనురు మండలం బెల్లాపూర్లో వారం రోజులుగా తాగు నీరు సరఫరా కావడం లేదంటూ స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. నిజాంపేట్-బీదర్ జాతీయ రహదారి పై గంట పాటు నిరసన తెలిపారు.
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు - bellapur villagers protest for drinking water
వారం రోజులుగా తాగు నీటి సరఫరా కావడం లేదని సంగారెడ్డి జిల్లా మనురు మండలం బెల్లాపూర్ గ్రామ మహిళలు ఆందోళనకు దిగారు. నిజాంపేట్-బీదర్ జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.

protest for water
వారం రోజులుగా భగీరథ నీరు రావడం లేదని ఆవేదన చెందారు. అధికారులు తమ గోడు పట్టించుకోకుండా దాట వేస్తున్నారని వాపోయారు. వ్యవసాయ బోరు బావుల వద్ద నుంచి నీరు తెచుకుంటున్నామని తెలిపారు. పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పగా మహిళలు ఆందోళన విరమించారు.