తెలంగాణ

telangana

ETV Bharat / state

బీరంగూడ ఆలయానికి పోటెత్తిన భక్తులు - సంగారెడ్డి జిల్లా ఈరోజు వార్తలు

సంగారెడ్డి జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయానికి శివరాత్రి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. శివ స్వాములు దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

beeramguda temple visit more people at sangareddy
బీరంగూడ ఆలయానికి పోటెత్తిన భక్తులు

By

Published : Feb 21, 2020, 9:36 AM IST

సంగారెడ్డి జిల్లా బీరంగూడ గుట్టపై శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో మహా శివరాత్రి పురస్కరించుకుని అర్చకులు రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామివారిని అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఆలయ మండపంలో సామూహిక అభిషేకాలు చేశారు.

పెరుగుతున్న భక్తుల దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. స్వామిని దర్శించుకునేందుకు శివస్వాములు, భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

బీరంగూడ ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఇదీ చూడండి :బ్రహ్మ, విష్ణువు తగువు తీర్చిన రోజు!

ABOUT THE AUTHOR

...view details