సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలను ఇళ్ల ముందు ఉంచి.. మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ కలిసి పండుగను ఉల్లాసంగా జరుపుకున్నారు.
ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒకచోట పేర్చి.. మహిళలంతా ఆనందంగా ఆడి పాడారు.
ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
అనంతరం సమీపంలోని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆయా గ్రామాల సర్పంచులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి.. గౌరమ్మ దయతో.. కరోనా కనుమరుగవ్వాలి: ఎమ్మెల్సీ కవిత