ఆడపడుచులు ఎంతగానో ఇష్టపడే బతుకమ్మ ఉత్సవాలను సంగారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మహిళలు ఇళ్లలో వివిధ రకాల పూలతో పోటాపోటీగా బతుకమ్మలను పేర్చారు. ప్రతి ఇంటి నుంచి బతుకమ్మలను ఎదురుకొచ్చారు. బతుకమ్మలను మధ్యలో ఉంచి ఆడపడుచులు కోలాటాలతో సంతోషంగా ఆడి పాడారు. తర్వాత బతుకమ్మలను ఆ గంగమ్మ ఒడిలోకి పంపారు.
ఘనంగా బతుకమ్మ వేడుకలు.. ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు
సంగారెడ్డి జిల్లా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఇంటి నుంచి మహిళలు పోటాపోటీగా బతుకమ్మలను పేర్చి ఒకే చోటుకి తీసుకొచ్చి కోలాటాలు ఆడారు.
ఘనంగా బతుకమ్మ వేడుకలు.. ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు
అనంతరం మహిళలు ఒకరికొకరు పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు. తర్వాత చిరు ధాన్యాలలో బెల్లం, చక్కెరను కలిపి ప్రసాదంగా పంచుకున్నారు. కరోనా మహమ్మారి లేకుండా ఉంటే.. బతుకమ్మ సంబురాలు మరింత ఘనంగా జరుపుకునేవారిమని మహిళలు వెల్లడించారు.