సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను ఒకచోట చేర్చి మహిళలు ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ పాటలు పాడుతూ.. చిన్నా పెద్దా ఉత్సాహంగా గడిపారు. అనంతరం స్థానిక మహబూబ్‌సాగర్ చెరువులో బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేర్చారు.
సంగారెడ్డిలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు - సంగారెడ్డిలో బతుకమ్మ సంబురాల వార్తలు
రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలంతా ఒకచోట చేరి బతుకమ్మ పాటలతో ఆడిపాడారు.
సంగారెడ్డిలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు
కరోనా భయంతో ఈసారి పండుగను అసంతృప్తిగా జరుపుకున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరమైనా పండుగను ఘనంగా జరుపుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరోనాను మన నుంచి దూరం చేయాలని గౌరమ్మను వేడుకున్నట్లు తెలిపారు.