కరోనా పోరాట యోధులకు బత్తాయి పండ్ల పంపిణీ - బత్తాయి పండ్ల పంపిణీ
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్లోని కంగ్టి మండలంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు, వైద్య సిబ్బందికి పీఆర్టీయూ ఆధ్వర్యంలో బత్తాయి పండ్లను పంపిణీ చేశారు.
![కరోనా పోరాట యోధులకు బత్తాయి పండ్ల పంపిణీ Batai fruits were distributed to the police and doctors under the PRTU.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7031774-840-7031774-1588418897805.jpg)
కరోనా వైరస్ కట్టడిలో సరిహద్దుల్లో సైనికుల వలె వైద్యారోగ్య సిబ్బందితో పాటు పోలీసు, పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారని పీఆర్టీయూ నేతలు కొనియాడారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్లోని కంగ్టి మండలంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్, వైద్య సిబ్బందికి బత్తాయి పండ్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చిందన్నారు. అటువంటి మహమ్మారిపై యుద్ధం చేస్తున్న మనకు ఉన్న ఏకైక ఆయుధం సామాజిక దూరం పాటించడమేనని పేర్కొన్నారు.. రోగ నిరోధకశక్తి దండిగా ఉండే ఈ పండ్లను తీసుకోవడం ఆవశ్యకమని సూచించారు.
TAGGED:
బత్తాయి పండ్ల పంపిణీ