జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. స్థానిక ఎస్బీఐ నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ చేపట్టి తమ నిరసన తెలిపారు. సమ్మెకు పలు ప్రజా కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి.
'బ్యాంకుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి'
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ నిరసనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
రేపూ సమ్మెలో పాల్గొంటామని ఉద్యోగులు పేర్కొన్నారు. బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే.. రాబోవు తరాలకు ఉద్యోగాలు లభించవని ఆందోళన వ్యక్తం చేశారు. ఖాతాదారుల డిపాజిట్లపై భరోసా ఉండదని, రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. ఉచితంగా అందించే సేవలు నిలిచిపోతాయని తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: తాగు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి: తమిళిసై