సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఓ బ్యాంకు ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పట్టణంలోనే స్థానికంగా ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబసమేతంగా నివసిస్తున్నారు. సోమవారం ఉదయం ఎంతకీ నిద్రలేవకపోగా.. అతని భార్య ఇంటి యజమానికి సమాచారమిచ్చారు.
అనుమానాస్పద స్థితిలో బ్యాంకు ఉద్యోగి మృతి - అనుమానాస్పద స్థితిలో బ్యాంకు ఉద్యోగి మృతి
ఓ బ్యాంకు ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో జరిగింది. సోమవారం ఉదయం ఎంతకీ నిద్రలేవకపోగా.. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
![అనుమానాస్పద స్థితిలో బ్యాంకు ఉద్యోగి మృతి bank-employee-died-in-suspicious-condition-at-narayankhed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7622383-422-7622383-1592205089279.jpg)
అనుమానాస్పద స్థితిలో బ్యాంకు ఉద్యోగి మృతి
వారు అతన్ని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఈటల ఓఎస్డీకి కరోనా... గత 2రోజులుగా ఆయనతోనే మంత్రి