బంజారాల గురువు సంత్ శ్రీ రామ్ రావు మహారాజ్ మృతికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బంజారా నాయకులు సంతాపం ప్రకటించారు. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మహారాజ్ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు.
రామ్ రావు మహారాజ్ మృతి పట్ల బంజారా నాయకుల సంతాపం - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
బంజారాల గురువు సంత్ శ్రీ రామ్ రావు మహారాజ్ మృతి పట్ల సంగారెడ్డి జిల్లా బంజారా నాయకులు సంతాపం ప్రకటించారు. జహీరాబాద్లోని బంజారా భవన్లో మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
రామ్ రావు మహారాజ్ మృతి పట్ల బంజారా నాయకుల సంతాపం
సేవాలాల్ మహారాజ్ చూపిన బాటలో నడిచేందుకు రామ్ రావు మహారాజ్ స్ఫూర్తిదాయకంగా నిలిచారని నాయకులు గుర్తు చేసుకున్నారు. బంజారా ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ నాయకులు మహారాజ్ సంతాప సభలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'పాక్ ప్రకటనతో వారి నిజస్వరూపం బయటపడింది'
TAGGED:
sri ram rao maharaj death