సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ ఆశ్రమంలో దత్త జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. ఆలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు మనుగడ సాధించాలంటే... ఓ చేతిలో గులాబీ జెండా.. మరో చేతిలో కాషాయ జెండా పట్టుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు హిందూ ధర్మ పరిరక్షకులుగా... నిధులు సేకరించాలని పిలుపునిచ్చారు.
మనుగడ సాధించాలంటే కాషాయ జెండా పట్టాల్సిందే: సంజయ్ - బండి సంజయ్ వార్తలు
దేశంలోనైనా, రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మనుగడ సాధించాలంటే కాషాయ జెండా పట్టుకోవాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం నిధులు చేకూర్చడంలో హిందువులు ముందుకు రావాలని సూచించారు.
మనుగడ ఉండాలంటే కాషాయ జెండా పట్టాల్సిందే: బండి సంజయ్
దేశంలో 12 శాతం జనాభా ఉన్న ముస్లింలు విజయం సాధిస్తుంటే... 88% హిందూ జనాభా ఉన్న చోట్ల భాజపా ఎందుకు విజయం సాధించలేకపోతుందో ఆత్మపరిశీలన చేసుకోవాలని సంజయ్ అన్నారు.
ఇదీ చూడండి:2020 రౌండప్: బండి జోరు.. భాజపా విజయాల హోరు