తెలంగాణ

telangana

ETV Bharat / state

కమీషన్ల కోసం కొత్త సచివాలయం: బండి

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు అభ్యర్థి ఆశిశ్​ గౌడ్​కు మద్దతుగా భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. బిహార్​లో పోటి చేసిన ఎంఐఎంకు ఐదు సీట్లు వస్తే.. భాగ్యనగరంలో పోటీ చేస్తున్న భాజపాకు అన్ని స్థానాలు రావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

bandi-sanjay-said-new-secretariat-building-for-commission-only
కమీషన్ల కోసం కొత్త సచివాలయం: బండి

By

Published : Nov 27, 2020, 11:23 AM IST

బిహార్​లో 12 శాతం ఉన్న ఓట్లతో ఎంఐఎం ఐదు స్థానాలు గెలిస్తే.. హైదరాబాద్​లో 80 శాతం ఉన్న హిందువులు కలిస్తే అన్ని స్థానాల్లో భాజపా గెలుస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు అభ్యర్థి ఆశిశ్​ గౌడ్​కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ వంద కోట్లతో ప్రగతిభవన్ నిర్మించుకున్నాడని.. కానీ సచివాలయానికి మాత్రం పోలేదని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ సచివాలయం కూలగొట్టి కమీషన్ల కోసం కొత్తది నిర్మిస్తున్నారని ఆరోపించారు. తెరాస పోయి.. భాజపా రావాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి :రేషన్​ డీలర్ల కమీషన్​ సరిపోవడం లేదు: మోదీ

ABOUT THE AUTHOR

...view details