తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay Fires on CM KCR : 'కేసీఆర్​.. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు' - Bandi Sanjay fires on KCR

Bandi Sanjay Fires on CM KCR : సీఎం కేసీఆర్​పై బండి సంజయ్​ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. నిరుద్యోగుల జీవితాలతో సీఎం ఆడుకుంటున్నారని మండిపడ్డారు. నష్టపోయిన అన్నదాతకు సాయం చేయని కేసీఆర్‌కు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శులకు ముఖ్యమంత్రి అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Bandi Sanjay
Bandi Sanjay

By

Published : May 11, 2023, 9:06 PM IST

Updated : May 11, 2023, 10:02 PM IST

Bandi Sanjay Fires on CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోటి నుంచి అభివృద్ధి అనే మాటే రావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో సీఎం ఆడుకుంటున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జీతాలు ఇవ్వని కేసీఆర్‌కు ఓటు ఎందుకు వెయ్యాలని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన బీజేపీ నిరుద్యోగ మార్చ్​లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఖమ్మం, నిజామాబాద్‌లో నిరుద్యోగ మార్చ్‌ నిర్వహిస్తామని.. చివరిగా హైదరాబాద్‌లో నిరుద్యోగ మార్చ్‌ చేపడతామని బండి సంజయ్​ పేర్కొన్నారు. నష్టపోయిన రైతుకు సాయం చేయని కేసీఆర్‌కు ఎందుకు ఓటు వెయ్యాలని ప్రశ్నించారు. కేంద్రం చేపడుతున్న ఉద్యోగ భర్తీల్లో ఎక్కడా అవినీతి లేదని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులకు ముఖ్యమంత్రి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాల నుంచి తొలగించినా.. కార్యదర్శులు ఉద్యమం ఆపకండని.. బీజేపీ ప్రభుత్వం వచ్చాక మీకు ఉద్యోగం ఇస్తుందని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

"నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ అడుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. జీతాలు ఇవ్వని కేసీఆర్‌కు ఓటు ఎందుకు వెయ్యాలి. నష్టపోయిన రైతుకు సాయం చేయని కేసీఆర్‌కు ఎందుకు ఓటెయ్యాలి. కేంద్రం చేపడుతున్న ఉద్యోగ భర్తీల్లో ఎక్కడా అవినీతి లేదు. పంచాయతీ కార్యదర్శులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు."- బండి సంజయ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

డబ్బు తీసుకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతారు..: మునుగోడు ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసి గెలిచారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఆరోపించారు. ఓటర్లు ఓటుకు రూ.5,000 తీసుకున్నారని అన్నారు. ఓటు కోసం డబ్బు తీసుకునే ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని.. డబ్బు తీసుకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతారని పేర్కొన్నారు. సచివాలయానికి ప్రతిపక్షాలు వస్తే ఆపుతున్నారని మండిపడ్డారు. రూ.400 కోట్లతో సచివాలయం నిర్మాణం అని చెప్పారని.. ఇప్పుడు రూ.1,600 కోట్లతో సచివాలయం నిర్మించారని ఆమె ఆరోపించారు.

ఈ క్రమంలోనే మిగతా రూ.1,200 కోట్లు ఎవరి జేబులో పెట్టారని విజయశాంతి ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే గానీ మన సమస్యలు తీరవని అన్నారు. తాను పార్టీలో ఉన్నానా అని అడుగుతున్నారని.. తాను బీజేపీలోనే ఉన్నానని ఆమె స్పష్టం చేశారు.

కేసీఆర్​.. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు

ఇవీ చదవండి:Bandi on Double Bedroom Houses : ''డబుల్‌' ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులిస్తే.. తప్పుదోవ పట్టించారు'

RSP Fires on CM KCR : 'కిసాన్ సర్కార్ అంటే పాడి రైతుల పొట్ట కొట్టడమేనా..?'

సుప్రీం తీర్పుపై మాటల యుద్ధం.. రాజీనామాకు ఠాక్రే డిమాండ్.. ఫడణవీస్ చురకలు

Last Updated : May 11, 2023, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details