సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భజరంగ్ దళ్ కార్యకర్తలు చైనాకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి... బస్టాండ్ చౌరస్తా వద్ద ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ చిత్ర పటాన్ని దగ్ధం చేశారు. మన దేశ సంక్షేమం కోసం... చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలు, వ్యాపారులకు భజరంగ్ దళ్ విజ్ఞప్తి చేసింది.
సంగారెడ్డిలో చైనా అధ్యక్షుడి చిత్రపటం దగ్ధం - Bajarangdal China President Flex burn
గాల్వన్‌లోయ ఘటనను నిరసిస్తూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చిత్రపటాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భజరంగ్‌దళ్ కార్యకర్తలు దగ్ధం చేశారు. చైనా వస్తువులను ప్రజలు బహిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
![సంగారెడ్డిలో చైనా అధ్యక్షుడి చిత్రపటం దగ్ధం](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News
సంగారెడ్డి పట్టణంలోని మొబైల్ దుకాణాల్లోకి వెళ్లి.. ఇక నుంచి చైనా ఫోన్లు తీసుకురావద్దని కోరారు. వాటి అమ్మకాలు చేపట్టవద్దని వ్యాపారులకు సూచించారు. చైనా ఉత్పత్తులను మనదేశంలో బహిష్కరించడం వల్లనే ఆ దేశానికి బుద్ధి చెప్పినట్లవుతుందని వారు తెలిపారు.
ఇదీ చూడండి:యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్