తెలంగాణ

telangana

ETV Bharat / state

బీబీఎస్​లో బహుజన ఐక్యవేదిక విలీనం - bahujana ikya vedika

బహుజన్ భీమ్ సోల్జర్స్​లో బహుజన ఐక్యవేదిక విలీన సమావేశాన్ని సంగారెడ్డిలో నిర్వహించారు. ప్రమాదంలో ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఐక్యవేదిక నాయకులు తెలిపారు.

bahujana ikya vedika merge in bahujana bheem solders
బీబీఎస్​లో బహుజన ఐక్యవేదిక విలీనం

By

Published : Mar 3, 2020, 5:48 PM IST

బహుజన్​ భీమ్ సోల్జర్స్​లో బహుజన ఐక్యవేదికను విలీనం చేశారు. ఈ సందర్భంగా బహుజన్​ భీమ్ సోల్జర్స్​ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నందున కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని బీబీఎస్ అధ్యక్షుడు పల్పనూరి శేఖర్ అన్నారు.

అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయాణంలో విలీనం చేస్తున్నట్టు బహుజన ఐక్యవేదిక నాయకులు అన్నారు. సంస్థ ఉద్దేశాలు నచ్చడం వల్ల బహుజన్ భీమ్ సోల్జర్స్​తో కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

బీబీఎస్​లో బహుజన ఐక్యవేదిక విలీనం

ఇదీ చూడండి:కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

ABOUT THE AUTHOR

...view details