సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ మెజార్టీ వార్డుల్లో విజయం సాధించినప్పటికీ.. నిరాశే మిగలనుంది. నారాయణఖేడ్ పురపాలిక పరిధిలో 15 వార్డులుండగా.. అధికార తెరాస 7, కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించాయి.
వార్డుల్లో గెలిచినా... పీఠం దక్కించుకోని కాంగ్రెస్..!
నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పరిస్థితి విచిత్రంగా మారింది. అత్యధిక వార్డుల్లో విజయం సాధించినప్పటికీ.. అధికార పీఠం చేజిక్కించుకోలేకపోతోంది. ఎక్స్అఫీషియో ఓటు కారణంగా ఛైర్మన్ పీఠాన్ని కోల్పోనుంది.
వార్డుల్లో గెలిచినా... పీఠం దక్కించుకోని కాంగ్రెస్
మెజార్టీ వార్డుల్లో విజయం సాధించినా.. హస్తానికి పీఠం దక్కేలా లేదు. స్పష్టమైన మెజార్టీ రానందున స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ఎక్స్అఫీషియో ఓటు వినియోగం ద్వారా తెరాసకు తమ మద్దతు ఇవ్వనున్నారు. అధిక వార్డుల్లో కాంగ్రెస్ గెలిచినా... నిరాశ తప్పేలాలేదు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: కాంగ్రెస్ ఖాతాలో వడ్డేపల్లి మున్సిపాలిటీ