సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామంలోని దళిత వార్డు మెంబర్‌పై గ్రామ సర్పంచ్ అసభ్యంగా ప్రవర్తించి, కులం పేరుతో దూషించాడని పట్టణ కేంద్రంలోని కలక్టరేట్ కార్యాలయం ముందు గ్రామస్థులు, కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ ఘటన జరిగి వారం రోజులు గడిచినా సర్పంచ్‌పై ఎలాంటి చర్య తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
మహిళావార్డు మెంబర్‌తో సర్పంచ్ అసభ్య ప్రవర్తన - latest news of sangareddy
సంగారెడ్డి జిల్లా గొల్లగూడెం గ్రామ సర్పంచ్ మహిళా వార్డుమెంబర్తో అసభ్యంగా ప్రవర్తిస్తూ కులం పేరుతో దూషించాడంటూ గ్రామస్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సర్పంచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మహిళావార్డు మెంబర్‌పై కులంపేరుతో సర్పంచ్ అసభ్య ప్రవర్తన
తమను కులం పేరుతో దూషించడమే కాకుండా కుటుంబంతో కలిసి భౌతిక దాడికి పాల్పడినందుకు సర్పంచ్‌ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని కుల వివక్షత వ్యతిరేక పోరాట సమితి నాయకులు హెచ్చరించారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు