సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని వివిధ మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పర్యటించారు. కరోనా వైరస్ వ్యాప్తి, నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. లాక్డౌన్లో భాగంగా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. వైరస్ నివారణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. పట్టణంలో పారిశుద్ధ్య సిబ్బంది చేపడుతున్న రసాయనాల పిచికారిని ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్లు, అధికారులు ఉన్నారు.
వైరస్ నివారణకు ప్రజలు సహరించాలి: ఎమ్మెల్యే - నారాయణ్‌ఖేడ్‌లో కోరానపై ఎమ్మెల్యే అవగాహన
కరోనా వైరస్ నివారణకు ప్రజలంతా సహకరించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలోని వివిధ మున్సిపాలిటీల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు.
వైరస్ నివారణకు ప్రజలు సహరించాలి: ఎమ్మెల్యే