సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని చాప్ట (కె)కు చెందిన వడ్ల సంతోశ్ చారి(24), వడ్ల నవీన్ చారీలు నారాయణఖేడ్ నుంచి ద్విచక్ర వాహనంపై తమ స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో పట్టణ శివారులో గల జి.హుక్రాన సమీపంలోని దర్గా వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ బలంగా ఢీకొన్నాయి.
ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీ.. ఒకరు దుర్మరణం - నారాయణఖేడ్‌లో రోడ్డు ప్రమాదం
ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నారాయణఖేడ్‌లో చోటు చేసుకుంది. పట్టణ శివారులో గల జి.హుక్రాన సమీపంలోని దర్గా వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ బలంగా ఢీకొన్నాయి.
ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీ.. ఒకరు దుర్మరణం
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న వి. సంతోశ్, చారి తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా సంతోశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆటో డ్రైవర్, ఆటోలో ప్రయాణిస్తున్న మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించామని ఎస్సై సందీప్ పేర్కొన్నారు . మృతుడి సోదరుడు వడ్ల బ్రహ్మం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్ల వెల్లడించారు.
ఇవీ చూడండి:సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్