సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలో అక్రమ కట్టడాలను హెచ్ఎండీఏ అధికారులు కూల్చివేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో 703 నుంచి 710 వరకు ఉన్న సర్వే నంబర్లలో అధికారుల అనుమతి లేకుండా పలువురు వెంచర్లు, లేఅవుట్లు వేశారు. అందులో నిర్మాణాలు చేపడుతున్నారు.
అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన అధికారులు - సంగారెడ్డి జిల్లా రుద్రారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత వార్తలు
సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని అక్రమ కట్టడాలను అధికారులు నేలమట్టం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్ల నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించారు.
అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన అధికారులు
అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కట్టడాలు కొనసాగడంతో.. కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. అనుమతి లేకుండా వెంచర్లు వేయవద్దని డీఎల్పీవో సతీశ్‌రెడ్డి హెచ్చరించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Last Updated : Jul 30, 2020, 10:07 PM IST