తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏటీఎం చోరీకి విఫలయత్నం

గుర్తుతెలియని దుండగులు ఏటీఎం ధ్వంసం చేసి నగదును తస్కరించడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

attempt for atm theft
attempt for atm theft

By

Published : May 19, 2020, 7:37 PM IST

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం శివంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ఇండికా క్యాష్ ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి అందులోని నగదును తస్కరించడానికి ప్రయత్నం చేశారు. అది తెరచుకోకపోవడం వల్ల వారు అక్కడి నుంచి పారిపోయారు.

ఘటనాస్థలిని డీఎస్పీ శ్రీధర్​రెడ్డి సందర్శించారు. పుల్కల్ ఎస్ఐ నాగలక్ష్మి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి: రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details