సంగారెడ్డి పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను ఇద్దరు వ్యక్తులు పగులగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు రామచంద్రాపురానికి చెందిన స్నేహితులు మహమూద్ ఖలీద్, ఎరుకల మహేశ్‌గా గుర్తించారు.
ఏటీఎం చోరీకి విఫలయత్నం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన వైనం - ATM thieves arrested in patancheru
సులువుగా సంపాదించాలనే దురుద్దేశంతో ఇద్దరు స్నేహితులు.. ఏటీఎంలలో దొంగతనాలు చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో చోటుచేసుకుంది.
ఏటీఎం చోరీకి విఫలయత్నం..
ఇంతకుముందు వీరు ఐదు ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. జూన్ 8, జూన్ 19, ఆగస్టు 30 , సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2న పలు చోట్ల ఏటీఎంలలో చోరీకి యత్నించారని వెల్లడించారు.