కరోనా వైరస్ ప్రభావం పరిశ్రమలపై కూడా చూపుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలోని ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో కార్మికుడికి కరోనా పాజిటివ్ రావటం వల్ల రెండు షిఫ్టులు రద్దు చేసి అత్యవసరంగా పరిశ్రమ మూసేశారు. ఆ పరిశ్రమలో ఎలక్ట్రీషన్ విభాగంలో కార్మికుడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. రెండో షిఫ్టు, రాత్రి షిఫ్ట్ కూడా రద్దు చేసింది. ఈ సమయంలో పరిశ్రమ శానిటైజ్ చేసి మళ్లీ ఉదయాన్నే తొలి షిఫ్టు నిర్వహణ ఉంటుందని కార్మికులకు యాజమాన్యం తెలిపింది.
ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో కార్మికుడికి కరోనా పాజిటివ్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలోని ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో కార్మికుడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. విషయం తెలుసుకున్న ఏషియన్ పెయింట్స్ పరిశ్రమ యాజమాన్యం అత్యవసరంగా కంపెనీని మూసేసింది. కార్మికులను ఇళ్లకు పంపించింది. రెండో షిఫ్టు, రాత్రి షిఫ్ట్ కూడా రద్దు చేసింది.
ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో కార్మికుడికి కరోనా పాజిటివ్
బాధితుడు చందానగర్‌లో ఇద్దరు స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఒక స్నేహితుడికి కోయంబత్తూర్ ఎయిర్‌పోర్టులో నిర్వహించిన పరీక్షల్లో అక్కడి అధికారులు కరోనా పాజిటివ్ నిర్ధరణ చేశారు. సమాచారం తెలిసిన ఏషియన్ పెయింట్స్ పరిశ్రమ యాజమాన్యం కార్మికుడిని ఆదివారం రోజున ఇంటికి పంపించేశారు. సోమవారం ఆ కార్మికుడు తన గదిలో ఉన్న మరో స్నేహితుడితో కలిసి కింగ్ కోఠి ఆసుపత్రిలో కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోగా ఫలితాలు పాజిటివ్‌గా వచ్చాయి.