తెలంగాణ

telangana

ETV Bharat / state

అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన భాజపా నేతల అరెస్ట్​

సంగారెడ్డి జిల్లాలో ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన భాజపా నాయకులను పోలీసులు అరెస్ట్​ చేశారు. పోలీసుల తీరుపై నాయకులు అసహనం వ్యక్తం చేశారు.

Arrest of BJP leaders who stormed the assembly
అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన భాజపా నేతల అరెస్ట్​

By

Published : Sep 11, 2020, 1:17 PM IST

సంగారెడ్డిలో భాజపా నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా వారిని స్థానిక పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అవుతున్నా.. విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించడం లేదని నాయకులు ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా చేయాల్సిన పనిని ఇప్పటికీ చేయకుండా ఉండటం ఏంటని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించి, గోల్కొండపై జెండా ఎగురవేయాలని డిమాండ్​ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భాజపా వైపు మొగ్గుచూపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీచూడండి.. ఫార్మాసిటీ ఏర్పాటును ఉపసహరించుకోవాలి : ప్రొ.కోదండరాం

ABOUT THE AUTHOR

...view details