సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కోఆప్షన్ సభ్యుల ఎంపికలో వాగ్వాదం చోటు చేసుకుంది. తెరాస తరఫున శివానగర్కు చెందిన ఇతిహాస్ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున కాజిపల్లికి చెందిన మహ్మద్ రావూఫ్ గడువు ముగిశాక నామినేషన్ దాఖలు చేయడం వల్ల తెరాస వర్గీయులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్, తెరాస వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై నిర్ణయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదించామని ఎన్నికల అధికారులు తెలిపారు.
జిన్నారంలో తెరాస, కాంగ్రెస్ వర్గీయుల మధ్య వాగ్వాదం - fight
గడువు ముగిశాక కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం నామినేషన్ దాఖలు చేయడం వల్ల సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో కాంగ్రెస్, తెరాస వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
కో ఆప్షన్ సభ్యుల ఎంపికలో తెరాస, కాంగ్రెస్ మధ్య వాగ్వాదం