విదేశీ విద్య కోసం మైనార్టీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈనెల 30తో గడువు ముగియనుంది. దరఖాస్తుల కోసంwww.telanganaepass.cgg.gov.in వెెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.
ఇవీ అర్హతలు
- విద్యార్థులు మైనార్టీ వర్గానికి చెందిన వారై ఉండాలి.
- 2020, అక్టోబరు 26 నాటికి 35 ఏళ్ల వయస్సు మించవద్ధు
- తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు.
- డిగ్రీ, ఇంజినీరింగ్‌లో 60శాతం మార్కులు సాధించి ఉండాలి.
ఎక్కడెక్కడ అంటే..
అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో చదివేందుకు దరఖాస్తు చేసుకోవచ్ఛు ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, వ్యవసాయ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్స్ విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరేందుకు వీలుంటుంది.