రెండు పడక గదుల ఇళ్ల కోసం దరఖాస్తుల స్వీకరణ - ఈ నెల 18 వరకు రెండు బెడ్రూం ఇళ్ల దరఖాస్తు స్వీకరణ
రెండు పడక గదుల ఇళ్ల కోసం సంగారెడ్డి పటాన్చెరు గ్రేటర్ సర్కిల్లో సెప్టెంబర్ 10 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఉపకమిషనర్ బాలయ్య ప్రకటించారు. ఇందుకోసం సర్కిల్ పరిధిలో 15 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఈ నెల 18 వరకు రెండు పడక గదుల ఇళ్ల కోసం దరఖాస్తు స్వీకరణ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గ్రేటర్ సర్కిల్లో రెండు పడకగదుల ఇళ్ల కోసం సెప్టెంబర్ 10( గురువారం) నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఉపకమిషనర్ బాలయ్య వెల్లడించారు. సర్కిల్ పరిధిలో దరఖాస్తుల స్వీకరణ కోసం 15 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని బాలయ్య అన్నారు. వీటితో పాటు ఆదివారాలు, రెండో శనివారం సెలవు దినాలుగా ఉంటాయని.. ఆ రోజు దరఖాస్తులను స్వీకరించబోమని తెలిపారు.
15 కేంద్రాలు ఇవే
- పటాన్చెరు గ్రేటర్ కార్యాలయం- చైతన్యనగర్ కాలనీ మొదటి , రెండు వార్డులు.
- శాంతినికేతన్ హైస్కూల్ - గౌతంనగర్ మూడో వార్డు.
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల - కటికబస్తీ , మార్కెట్ రహదారి, ముదిరాజ్ బస్తీ 4 , 5 వార్డులు.
- గ్రేటర్ మల్టీపర్పస్ పంక్షలు- నాయికోటి బస్తీ, నాగులమ్మగడ్డ 1 వార్డుకు
- వాసవి భవన్ -జేపీ కాలనీ 8 , 16 వార్డులు.
- ఎస్సీ , బీసీ వసతిగృహం - అంబేడ్కర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, 10 , 13 వార్డులు.
- పాత తహసీల్దార్ కార్యాలయం- శాంతినగర్, శ్రీనగర్ కాలనీ 9 , 11 , 12 వార్డులు.
- తహసీల్దార్ కార్యాలయం - శ్రీరామ్ నగర్ కాలనీ 14 వార్డు.
- బొంబే కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల - బొంబే కాలనీ, ఇక్రిశాట్ ఫెన్సింగ్ ప్రాంతం.
- ఎల్‌జీ వార్డు కార్యాలయం - ఎఐజీ, బీడీఎల్ కాలనీ, మ్యాక్ పొసైటీ, హెఐజీ మాధవనగర్ కాలనీ.
- ఎంఐజీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల - ఎంఐజీ, పాత ఎంఐజీ, విద్యుత్ నగర్, అన్నమయ్య కాలనీ.
- పాత రామచంద్రాపురం మహిళామండలి భవన్- పాతరామచంద్రాపురం, శ్రీసాయినగర్ కాలనీ, సంగీత థియేటర్ ప్రాంతం, రామచంద్రా రెడ్డి నగర్, వాసవినగర్ కాలనీ.
- రామచంద్రాపురం గ్రేటర్ డివిజన్ కార్యాలయం- ఏఎన్ కాలనీ, ఆదివారం మార్కెట్ ప్రాంతం, కాశీ రెడ్డిపల్లి, వడ్డెరబస్తీ, ఎస్సీ బస్తీ.
- కానుకుంట ప్రాథమిక పాఠశాల- కానుకుంట, పాత ముంబై జాతీయ రహదారి, వినాయకనగర్, జ్యోతినగర్, అశోక్ నగర్, కాకతీయ నగర్, మయూరి నగర్, సాయినగర్ కాలనీ, మల్లికార్జున నగర్.
- బండ్లగూడ గ్రేటర్ కార్యాలయం- బండ్లగూడ, నేతాజీనగర్, భూపాల్ రెడ్డినగర్ కాలనీ, బాలాజీనగర్, మార్క్స్ కాలనీ.