తెలంగాణ

telangana

ETV Bharat / state

పటాన్‌చెరు టీఎస్ఐఐసీ ఇంఛార్జ్ జోనల్ మేనేజర్‌గా అనురాధ - పటాన్‌చెరు టీఎస్ఐఐసీ వార్తలు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని టీఎస్ఐఐసీ ఇంఛార్జ్ జోనల్ మేనేజర్‌గా డిప్యూటీ జోనల్ మేనేజర్ అనురాధను ఎండీ వెంకట నరసింహారెడ్డి నియమించారు. అనురాధ ఇప్పటికే నిమ్జ్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

patancheru tsiic
patancheru tsiic

By

Published : Jul 28, 2020, 3:37 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని టీఎస్ఐఐసీ ఇంఛార్జ్ జోనల్ మేనేజర్‌గా డిప్యూటీ జోనల్ మేనేజర్ అనురాధ నియమితులయ్యారు. ప్రస్తుత జోనల్ మేనేజర్ కళావతికి కరోనా సోకడంతో ఆమె హోం క్వారంటైన్‌కు పరిమితమయ్యారు. ఈనెలాఖరులో ఆమె పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ స్థానంలో అనురాధను నియమించారు.

అనురాధ ఇప్పటికే నిమ్జ్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జోనల్ మేనేజర్‌గా కూడా విధులు నిర్వహించాలని టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details