సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ అధికారులు కరోనా వ్యాప్తిని నియంత్రించే చర్యలు ప్రారంభించారు. మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని దత్తగిరి, చెన్నారెడ్డి, బృందావన్ కాలనీ, రాంనగర్, ఎన్టీఆర్ చౌరస్తాలో అధునాతన యంత్రాలతో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేశారు.
జహీరాబాద్ పట్టణ వీధుల్లో రసాయనాల పిచికారి - chemicals spray in zaheerabad
రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జహీరాబాద్ ఆధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు ముమ్మరం చేశారు.
జహీరాబాద్ పట్టణ వీధుల్లో రసాయనాల పిచికారి
వైరస్ ద్రావణం పిచికారి చేసిన కాలనీలల్లో సుమారు 10 నిమిషాల పాటు ఎవ్వరు తిరగవద్దవని ప్రజలకు ఆధికారులు సూచించారు.
ఇదీ చూడండి:కరోనా ఎక్కడ, ఎన్ని రోజులు జీవించి ఉంటుందో తెలుసా?