సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ శివారులోని పరివార్ దాబా ఎదుట జరిగన దాడుల్లో తీవ్రంగా గాయపడిన అశోక్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
గైడ్ల హత్యకేసులో మరో వ్యక్తి మృతి - గైడ్ల హత్య
సంగారెడ్డి జిల్లా రుద్రారం శివారులో జరిగిన గైడ్ల హత్య కేసులో.. కీలక ఆధారమైన అశోక్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
గైడ్ల హత్యకేసు.. మరో వ్యక్తి మృతి
రెండు రోజుల క్రితం దాబా ఎదుట దుండగుల దాడిలో మహమ్మద్ హాజీ అనే వ్యక్తి ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా మరో వ్యక్తి అశోక్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా ఈ రోజు అశోక్ మృతి చెందాడు. అతని ఆరోగ్యం మెరుగు పడితే హత్య కేసు చేధించేందుకు సులువు అవుతుందనుకున్న పోలీసులకు నిరాశే మిగిలింది.