సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం అంకెనపల్లి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, ఉప సర్పంచ్ మల్లేశం కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారిణి రాధికా రమణిని కలిశారు. తమ పంచాయతీ పరిధిలోని పెన్నార్, ఎంఆర్ఎఫ్ పరిశ్రమల్లో స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు యువతతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
'స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేలా చూడండి' - ankenapalli Sarpanch latest news
తమ పంచాయతీ పరిధిలోని పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చూడాలని అంకెనపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌లు జిల్లా రెవెన్యూ అధికారిని కలిశారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.
'స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేలా చూడండి'
తమ గ్రామ యువతకు ఉద్యోగాలు కల్పించాలని పెన్నార్ పరిశ్రమకు వెళితే.. యాజమాన్యం స్పందించలేదని సర్పంచ్ విజయలక్ష్మి పేర్కొన్నారు. అధికారులు స్పందించి.. వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కరోనా కష్టకాలంలో నిరుద్యోగులకు అండగా నిలవాలన్నారు.
ఇదీ చూడండి: సర్పంచ్‌గా పోటీ చేసేందుకు.. అర్హతలు.. అనర్హతలు ఏంటో తెలుసా?