తెలంగాణ

telangana

By

Published : Sep 1, 2019, 12:08 AM IST

ETV Bharat / state

లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన వీఆర్వో​...

రైతులకు పాస్​బుక్​లు ఇచ్చేందుకు లంచాలు తీసుకుంటూ అధికారులు అనిశాకు అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా నారాయణఖేడ్​ నియోజకవర్గంలో కల్హేర్​ తహసీల్దార్​ కార్యాలయంలో సీనియర్​ అసిస్టెంట్​గా విధులు నిర్వహిస్తున్న నర్సింలు... ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ అనిశా చేతికి చిక్కాడు.

Anisha gets a bribe ...

సంగారెడ్డి జిల్లాలోని కల్హేర్​ తహసీల్దార్​ కార్యాలయంలో సీనియర్​ అసిస్టెంట్​గా విధులు నిర్వహిస్తున్న నర్సింలు అనిశాకు చిక్కాడు. జోగిపేటలోని ఓ హోటల్​లో రైతు వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అందోల్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోగా విధులు నిర్వహించిన నర్సింలు కల్హేర్ తహసీల్దార్ కార్యాలయానికి పదోన్నతిపై బదిలీ అయ్యాడు.

అందోల్ మండలం దానంపల్లికి చెందిన కోనాపురం మాణయ్య అతని భార్య పేరు మీద రెండున్నర ఎకరాల పొలం ఉంది. కొత్త పాస్​బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. చింతకుంటకు చెందిన వీఆర్వో నర్సింలు రూ.10,000 లంచం ఇస్తేనే పాస్​పుస్తకాలను ఇస్తానని మాణయ్యకు తెలిపాడు. అంత ఇచ్చుకోలేనని రూ.2700 ఇచ్చారు. ఆ డబ్బు తీసుకున్న వీఆర్వో మిగతా డబ్బులు ఇచ్చే వరకు పాసుపుస్తకాలు ఇవ్వనని చెప్పాడు. విసుగు చెందిన రైతు మాణయ్య ఏసీబీని ఆశ్రయించాడు. వెంటనే స్పందించిన అధికారులు జోగిపేటలోని ఓ హోటల్​లో రూ. 5000 లంచం ఇస్తుండగా... పట్టుకున్నట్లు అనిశా అధికారులు వెల్లడించారు.

లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన వీఆర్వో​...

ఇదీ చూడండి:- తప్పతాగి తప్పుడు పనికి యత్నిస్తే ఉతికారేశారు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details