జహీరాబాద్లో అంగన్వాడీల ధర్నా
అక్షయపాత్ర ద్వారా అంగన్వాడీలకు భోజన సరఫరా నిలిపివేయాలని ఉద్యోగులు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
అక్షయ పాత్ర వద్దంటూ నినాదాలు
అంగన్వాడీ కేంద్రాల్లో వండిన భోజనంతో చిన్నారులకు పౌష్టికాహారం అందుతుందని...అక్షయపాత్ర సరఫరా చేసే భోజనంతో చిన్నారుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పద్ధతిలోనే పౌష్టికాహారం పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యలయంలోని అధికారులకు వినతిపత్రం అందించారు.