సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలోని మన గ్రోమోర్ కేంద్రంలో సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పంపిణీ చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువులను కొని మోసపోవద్దని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం మన గ్రోమోర్ కేంద్రంలో ఆయన కలియతిరిగారు.
నకిలీతో తస్మాత్ జాగ్రత! : ఎమ్మెల్యే - నకిలీ ఎరువులను కొని మోసపోవద్దు
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కోసం రైతులు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొని మోసపోవద్దని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సూచించారు. నకిలీలను గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

నకిలీ ఎరువులను కొని మోసపోవద్దు: ఎమ్మెల్యే
అక్కడ విక్రయిస్తున్న ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలను పరిశీలించారు. వాటి ధరలు, నాణ్యత తదితర అంశాలను కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీఛైర్పర్సన్ మంజు శ్రీ, ఎంపీపీ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.