తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటిపట్టునే ఉండండి.. ఈ కోడీ, గుడ్లూ మీకేనండి - an youngster helped his villagers

లాక్​డౌన్​ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సంగారెడ్డి జిల్లా గుంతపల్లిలో ఓ యువకుడు తన గ్రామస్థుల్ని కోరుతున్నాడు. ఇంట్లోనే ఉండాలని వారికి అవసరమైన కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాడు. ఇంటి పట్టునే ఉండండి... ఈ కోడీ, గుడ్లు మీకేనండి అంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.

an youngster distributed eggs and vegetables in gunthapally due to lock down
ఇంటిపట్టునే ఉండండి.. ఈ కోడీ, గుడ్లూ మీకేనండి

By

Published : Apr 26, 2020, 12:14 PM IST

లాక్‌డౌన్‌ వేళ ఊరికి తనవంతు ఉపకారం చేస్తున్నాడో యువకుడు.. శనివారం ప్రతి కుటుంబానికీ పది కోడిగుడ్లతో పాటు ఒక కోడినీ అందించాడు. సంగారెడ్డి జిల్లా గుంతపల్లికి చెందిన అనంతరెడ్డి నెలరోజుల వ్యవధిలో గ్రామంలో రెండుసార్లు కూరగాయలు, ఒకసారి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఫలితంగా దాదాపు 450 కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది.

గ్రామానికి సరిహద్దున వికారాబాద్‌ జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఊరి వాళ్లంతా స్థానికంగానే ఉండాలని, ఇతర గ్రామాలకు వెళ్లొద్దంటూ లాక్‌డౌన్‌కు అనుకూలంగా అనంతరెడ్డి ప్రచారమూ చేస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details