యువతిపై కత్తితో దాడి చేసిన అనంతరం పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మాచునూర్ శివారులో చోటుచేసుకుంది. సుమారు 17-18 ఏళ్ల యువతిని హత్యచేసి మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా... ఘటనా స్థలాన్ని జహీరాబాద్ డీఎస్పీ గణపత్ జాదవ్, గ్రామీణ సీఐ పాలవెల్లి సందర్శించారు.
సంగారెడ్డి నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి శవ పరీక్ష నిర్వహించారు. మృతదేహాన్ని గుర్తించడానికి కూడా వీలులేకుండా హంతకుడు ముఖం, పొట్ట భాగాల్లో పెట్రోలు అధికంగా పోసి నిప్పంటించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
'యువతి దారుణ హత్య...ఆపై దహనం' - ci palavelli
సంగారెడ్డి జిల్లాలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. మృతదేహాన్ని గుర్తించడానికి కూడా వీలులేకుండా హంతకుడు ముఖం, పొట్ట భాగాల్లో పెట్రోలు అధికంగా పోసి నిప్పంటించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మృతదేహాన్ని గుర్తించడానికి ఆనవాళ్లు లేవు
ఇవీ చూడండి : గర్భవతిని చేసి.. పెళ్లి చేసుకోను అంటున్నాడు