తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళ్లు చేతులు కోల్పోయి.. మళ్లీ కుంచె పట్టి.. - కాళ్లు చేతులు కోల్పోయి.. మళ్లీ కుంచె పట్టి..

నిన్నటి వరకు అక్షరాలు దిద్దిన ఆ చేతులు పోయాయి. చిన్నారి పాదాలతో బుడిబుడి అడుగులు వేయాల్సిన ఆ పసివాడు ఇప్పుడు కదలలేని స్థితిలో ఉన్నాడు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. మళ్లీ మొదటి నుంచి ఓనమాలు ప్రారంభించాడు.

కాళ్లు చేతులు కోల్పోయి.. మళ్లీ కుంచె పట్టి..

By

Published : Nov 16, 2019, 1:11 PM IST

సంగారెడ్డి జిల్లా కంకోల్​ గ్రామానికి చెందిన తుల్జారాం, ప్రమీల దంపతుల గారాల తనయుడు మధుకుమార్​. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కాళ్లు, చేతులు కోల్పోయాడు

కాళ్లు చేతులు కోల్పోయి.. మళ్లీ కుంచె పట్టి..

నెలరోజులు ఆసుపత్రిలో ఉన్న తరువాత ఇంటికొచ్చిన మధు ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించాడు. చదువుకోవాలన్న తపనను తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. మధుకుమార్ పరిస్థితిపై ఈటీవీ భారత్​ గతంలో ప్రచురించిన కథనాలకు బీడీఎల్​ విన్నర్​ ఫౌండేషన్​ సేవా సంస్థ అధ్యక్షుడు అరికెపూడి రఘు, చిత్రకళలో గిన్నిస్​ రికార్డు సాధించిన సముద్రాల హర్షలు స్పందించారు.మధుకుమార్​కు నోటితో అక్షరాలు రాసేలా శిక్షణ ప్రారంభించారు. నోటిలో కుంచె పెట్టి తొలుత అమ్మ అనే అక్షరాలు రాయించారు.

అతణ్ని త్వరలోనే జర్మనీకి తీసుకెళ్లి కృత్రిమ చేతులు అమర్చేందుకు కృషి చేస్తామని ఆ వదాన్యులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details