సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ అనాథాశ్రమంలో బాలికపై లైంగిక దాడి చేసిన ముగ్గురు నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజుల కస్టడీ గడువు ముగియడం వల్ల పోలీసులు వారిని జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతకంటే ముందు వారికి పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తేలడం వల్ల వారిని జిల్లాలోని కంది జైలులో అప్పజెప్పేందుకు తీసుకెళ్లారు.
ముగిసిన అమీన్పూర్ నిందితుల కస్టడీ.. జైలుకు తరలింపు! - కంది జైలు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మారుతి అనాథాశ్రమంలో బాలిక అత్యాచారం కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుల కస్టడీ గడువు ముగిసింది. వారిని జైలుకు తరలించేందుకు గానూ.. పోలీసులు పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి నేరుగా కంది జైలుకు తరలించారు.
ముగిసిన అమీన్పూర్ నిందితుల కస్టడీ.. జైలుకు తరలింపు!