తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్తీ కల్లులో ఆల్ఫ్రాజోలం డ్రగ్ వినియోగం - తయారీ కేంద్రాన్ని సీజ్ చేసిన పోలీసులు

Alprazolam Drug Manufacturing Units in Sangareddy : సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి శివారులో ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్న ముఠాను నార్కోటిక్‌ పోలీసులు పట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు రూ. 70 లక్షలు విలువైన ఆల్ఫ్రాజోలం డ్రగ్స్​ను సీజ్‌ చేశారు.

Alfazolam in sangareddy
Narcotics police seize Alfazolam in Fasalwadi

By ETV Bharat Telangana Team

Published : Dec 27, 2023, 5:56 PM IST

Updated : Dec 27, 2023, 7:42 PM IST

కల్తీ కల్లులో ఆల్ఫ్రాజోలం డ్రగ్ వినియోగం తయారీ కేంద్రాన్ని సీజ్ చేసిన పోలీసులు

Alprazolam Drug Manufacturing Units in Sangareddy :రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి అనే మాట వినబడడానికి వీల్లేదని, మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) ఆదేశాలతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం తనిఖీలు ముమ్మరం చేశారు. మత్తుపదార్థాల విక్రయం, రవాణా చేస్తున్న నిందితులపై కొరఢా ఝుళిపిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సంగారెడ్డి జిల్లాలో స్థానికుల సమాచారంతో యాంటీ నార్కోటిక్ బ్యూరో, పోలీసుల సోదాలు నిర్వహించారు.

వైఎస్సార్సీపీ నేత కుమారుడి రేవ్ పార్టీలో డ్రగ్స్ - ఎస్ఆర్ నగర్ మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తులో గుర్తించిన పోలీసులు

సంగారెడ్డి శివారులోని ఫసల్‌వాడిలోటీఎస్ యాంటీ నార్కోటిక్ బ్యూరో(TSNAB), రూరల్ పోలీసులు సయుక్తంగా దాడి చేసి 70 లక్షల విలువ గల నిషేధిత ఆల్ఫ్రాజోలం తయారీకి వాడే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు పాత నేరస్థులు ఉన్నట్లు ఎస్పీ చెన్నూరు రూపేశ్ తెలిపారు. అల్ఫ్రాజోలం తయారు చేస్తున్న నాలుగు కేంద్రాలను గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు.

అల్ఫాజోలం కొకైన్​ కంటే ప్రమాదకరం - అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు : సందీప్ శాండిల్య

నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. గ్రామ శివారులో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఆల్ఫ్రాజోలం తయారీకి రంగం సిద్దం చేసినట్లు గుర్తించామన్నారు. ఈ రసాయనాలు 3వ స్టేజెస్​లో ఉండగా పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రసాయనాన్ని కల్తీ కల్లు తయారీలో వినియోగిస్తున్నారని వెల్లడించారు.

ప్రధానంగా సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉండటంతో ఆల్ఫ్రాజోలం తయారీకి అనువుగా వినియోగించుకుంటున్నారని ఎస్పీ రూపేశ్ తెలిపారు. 2 వేల లీటర్ల కల్లు తయారీకి ఒక చిన్న ముక్క ఆల్ఫ్రాజోలం కలిపితే సరిపోతుందని వివరించారు. ఈ డ్రగ్ చాలా ప్రమాదకరమైందని దీని వల్ల ఆరోగ్యానికి పెను ముప్పు కలుగుతుందని వైద్యులు చెప్పారని వెల్లడించారు.

"సంగారెడ్డి శివారులోని ఫసల్‌వాడిలో టీఎస్ యాంటీ నార్కోటిక్ బ్యూరో, రూరల్ పోలీసులు సయుక్తంగా దాడి చేసి 70 లక్షల విలువ గల నిషేధిత ఆల్ఫ్రాజోలం తయారీకి వాడే ముడి పదార్థాలను స్వాదీనం చేసుకున్నాం. మొత్తం నలుగురు నిదితులను అదుపులోకి తీసుకున్నాం. గ్రామ శివారులో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నట్లు గుర్తించాం. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నాం".- చెన్నూరు రూపేశ్, ఎస్పీ సంగారెడ్డి జిల్లా

మాదకద్రవ్యాలపై పోలీసుల ఉక్కుపాదం - ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయించే ముఠా అరెస్ట్

Last Updated : Dec 27, 2023, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details