ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన మైనార్టీ గురుకులాలతో ముస్లింల జీవితాల్లో గుణాత్మక మార్పు రానుందని రాష్ట్ర మైనార్టీ గురుకుల విద్యా సంస్థ అధ్యక్షుడు ఏకే ఖాన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్మితమవుతున్న గురుకుల భవనాలను ఆయన పరిశీలించారు. అనంతరం గురుకులంలో ఉన్న విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు. భవనాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 19 కొత్త గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
గురుకుల విద్యార్థులతో క్రికెట్ ఆడిన ఏ.కె.ఖాన్ - గురుకుల భవనాలను పరిశీలించిన ఏకే ఖాన్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్మాణంలో ఉన్న గురుకులాల భవనాలను రాష్ట్ర మైనార్టీ గురుకుల విద్యా సంస్థ అధ్యక్షుడు ఏకే ఖాన్ పరిశీలించారు. అక్కడి విద్యార్థులతో క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరించారు.
![గురుకుల విద్యార్థులతో క్రికెట్ ఆడిన ఏ.కె.ఖాన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3725578-thumbnail-3x2-vysh.jpg)
గురుకుల భవనాలను పరిశీలించిన ఏకే ఖాన్