సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెదకంజర్ల గ్రామంలో పత్తి రైతులకు నూతన వంగడాల గురించి వ్యవసాయ అధికారిణి ఉష అవగాహన కల్పించారు. హెచ్టీ పత్తి విత్తనాలు వాడితే నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి లేదని తెలిపారు. కలుపు మందు తట్టుకునే పత్తి రకం గురించి వివరించారు. పత్తి విత్తనాలపై దళారుల మాటలు నమ్మి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
'హెచ్టీ పత్తి విత్తనాలకు అనుమతి లేదు' - వ్యవసాయ అధికారులు
నూతన పత్తి వంగడాలపై పటాన్చెరు వ్యవసాయ అధికారిణి రైతులకు అవగాహన కల్పించారు. హెచ్టీ పత్తి విత్తనాలకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదని వాటిని వాడకూడదని సూచించారు.
పత్తివిత్తనాలు