సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కేసారం గ్రామంలో మొక్కజొన్న, పత్తి పంటలో వచ్చే పురుగు వ్యాధులు వాటి నివారణ చర్యలపై రైతులకు వ్యవసాయ అధికారి ఏడిఏ సురేష్ బాబు, ఎవో ఉషతో కలిసి అవగాహన కల్పించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు, పత్తిలో గులాబీ పురుగు వస్తుందని వివరించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు భూసార కార్డులను అందజేశారు. పంటకు పురుగు పట్టడం వల్ల నష్టం వచ్చే గురించి రైతులకు వివరించారు. రైతులు పంటలను పరిశీలిస్తూ ఉండాలని, వ్యాధులు వచ్చిన వెంటనే రైతులు మేల్కొని తగు నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పురుగు వ్యాధుల గురించి....అధికారుల అవగాహన - పటాన్ చెరు
రైతుల పంటలకు వచ్చే పురుగు వ్యాధుల గురించి సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. మొక్కజొన్న, పత్తి పంటలకు వచ్చే పలు రకాల వ్యాధుల గురించి వివరించారు. అనంతరం రైతులకు భూసార కార్డులను అందజేశారు.
పురుగు వ్యాధుల గురించి....అధికారుల అవగాహాన