సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో రేపు జరగబోయే సహకార సంఘం ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి స్థాని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. జహీరాబాద్ డివిజన్లోని 14 సహకార సంఘాల్లో ఒకటి ఏకగ్రీవం కాగా 13 సంఘాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి.
సహకార సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి - సంగారెడ్డి జిల్లా వార్తలు
సహకార సంఘం ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. జహీరాబాద్ డివిజన్లోని 14 సహకార సంఘాల్లో ఒకటి ఏకగ్రీవం కాగా 13 సంఘాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి.
సహకార సంఘం ఎన్నికలు
మల్చల్మ, సత్వార్, బిలాల్ పూర్, మాచిరెడ్డిపల్లి, ఇప్పేపల్లి, రాయిపల్లి, ఏడాకులపల్లి, ఝరాసంగం, ఇందూర్, న్యాల్కల్, పీచేర్యాగడి, హద్నూర్, నల్లంబల్లి సహకార సంఘాల్లోని182 స్థానాలకుగాను 48 ఏకగ్రీవం కాగా మిగిలిన స్థానాలకు 270 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహించి భోజన విరామం అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు.
ఇదీ చూడండి:మరింత స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కేంద్ర లక్ష్యం నెరవేరుతుంది : కేటీఆర్