సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం సుల్తానాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పశువుల మేతతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ దగ్ధమైంది. నాగల్‌గిద్దకు చెందిన ఉప్పరి మాణిక్ సుల్తానాబాద్‌లో జొన్న చొప్ప కొనుగొలు చేసి ట్రాక్టర్లో తీసుకువెళ్తుండగా పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలాయి. ఈ ఘటనలో నిప్పు రవ్వలు చెలరేగి చొప్పకు మంటలు అంటుకున్నాయి. రైతులు తేరుకునే లోపు మంటలు అంతటా వ్యాపించాయి. వెంటనే డ్రైవర్ ట్రాలీ నుంచి ట్రాక్టర్ ఇంజిన్‌ను వేరు చేశాడు. చొప్పతో పాటు ట్రాలీ పూర్తిగా దగ్ధం అయింది. పశువులకు మేతకొరత తీవ్రంగా ఉందని రైతు వాపోయాడు. చొప్ప తీసుకుని పోతుంటే ప్రమాదం జరిగి చొప్ప పూర్తిగా కాలి పోయింది. తమ ప్రాంతంలో తలెత్తిన పశువుల మేత కొరతను తీర్చాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పశువుల మేతతో పాటు ట్రాక్టర్ ట్రాలీ దగ్ధం - agni-pramadam-tractar-dagdam
సంగారెడ్డి జిల్లా సుల్తానాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పశువుల మేతతో వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ తీగలు తగిలి ట్రాలీ పూర్తిగా దగ్ధమైంది. పశువులకు మేత దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
![పశువుల మేతతో పాటు ట్రాక్టర్ ట్రాలీ దగ్ధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3354643-thumbnail-3x2-pramadam.jpg)
పశువుల మేతతో పాటు ట్రాక్టర్ ట్రాలీ దగ్ధం
TAGGED:
agni-pramadam-tractar-dagdam